సిరాన్యూస్, ఆదిలాబాద్
నకిలీ విత్తనాలు తయారీదారులను జైలుకు పంపాలి
* కిసాన్ మోర్చా జైనథ్ మండల అధ్యక్షులు ఏనుగు రాకేష్ రెడ్డి
నకిలీ విత్తనాలు తయారీ చేస్తున్న వ్యక్తులను నాన్ బేలెబుల్ వారెంట్ కింద కేసులు పెట్టి జైలుకు పంపాలని కిసాన్ మోర్చా జైనథ్ మండల అధ్యక్షులు ఏనుగు రాకేష్ రెడ్డి అన్నారు.శనివారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యావత్ ప్రపంచానికి అన్నం పెట్టె రైతులకు ఈ నకిలీ విత్తనాలు తయారు చేసి రైతులని నిండా ముంచుతున్నారన్నారు. ప్రభుత్వం ఇటువంటి వారిని పీడీ యాక్ట్ కింద కేసులు బుక్ చేసి వారి షాప్ లైసెన్స్ లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కిసాన్ మోర్చా జైనథ్ మండల నాయకులు సిడం రాకేష్, సురేష్ రెడ్డిలు పాల్గొన్నారు.