సిరా న్యూస్, ఆదిలాబాద్:
బ్రైన్ స్ట్రోక్‌తో రామగిరి బాపయ్య మృతి…
+ వైద్యం కోసం లక్షలు ఖర్చు చేసిన యజమానులు అశోక్ పటేల్, రమేష్ శర్మ
+ ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందిన భాపయ్య
+ యజమానులకు బాధతప్త హృదయంతో కృతజ్ఞతలు తెలిపిన కుటుంబీకులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని నిరాల గ్రామానికి చెందిన రామగిరి బాపయ్య, తన భార్య నర్మద, ఇద్దరు పిల్లలతో కలిసి రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కాగా ఇటీవల హై బీపీతో బ్రైన్ స్ట్రోక్ రావడంతో హుటాహుటిన అతన్ని చికిత్స కోసం ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతని ఆర్థిక పరిస్థితిని గమనించి అతని యజమానులైనటువంటి అశోక్ పటేల్, రమేష్ శర్మలు దాదాపు రూ. 3లక్షలు ఖర్చు చేసి, చికిత్స చేయించారు. కానీ దురదృష్టవశాత్తు ఆదివారం వేకువజామున చికిత్స పొందుతూ మృతి ఆయన చెందాడు. కాగా స్వంత వాళ్లే కష్టాల్లో ఉన్న కూడ పట్టించుకోని ఈ కాలంలో, తమ వద్ద పనిచేస్తున్న ఒక గుమస్తా కోసం లక్షలు వెచ్చించిన యజమానులు అశోక్ పటేల్, రమేష్ శర్మలను పలువురు అభినందించారు. తమకు కష్టకాలంలో ఎంతాగానో అండగా నిలిచిన యజమానులకు కుటుంబ సభ్యులు బాధతప్త హృదయంతో కృతజ్ఙతలు తెలిపారు.