సిరా న్యూస్, బేల
సిర్సన్న ఉన్నత పాఠశాలకు జిల్లా స్థాయి బహుమతి
* బహుమతి ప్రదానం చేసిన పాయల్ శంకర్
రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జీవిత చరిత్ర పై నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాసరచన పోటీల్లో అదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న ఉన్నత పాఠశాలకు బహుమతి లభించింది.ఆ పాఠశాలకు చెందిన శంకర్ వార్ శ్రద్ధ పోటీలో పాల్గొని మూడో బహుమతి సాధించింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేతుల మీదుగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహాలక్ష్మి,విద్యార్థి శ్రద్ధ బహుమతి స్వీకరించారు.కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆరె భూమన్న, పోరెడ్డి లేనిన్ సభ్యులు పాల్గొన్నారు