Ramana: సోనాల శ్రీ రామాలయం హుండీ లెక్కింపు

సిరాన్యూస్‌, సోనాల
సోనాల శ్రీ రామాలయం హుండీ లెక్కింపు

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండ‌లం సోనాల గ్రామంలోని శ్రీ రామాలయం హుండీ లెక్కింపును శుక్ర‌వారం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా హుండి లెక్కింపు ద్వార రూ.41,555 ఆదాయం వచ్చింద‌ని ఆల‌య‌ కమిటీ చైర్మన్ గాండ్ల రమణ తెలిపారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వ‌హిస్తామ‌ని, శ్రీ రామాలయంలో 2013 సంవత్సరం నుండి సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించుకుంటున్నామ‌ని తెలిపారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన శ్రీరాముల వారి కళ్యాణం ఉన్నందున 12వ ఆలయ వార్షికోత్సవం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. శ్రీ సీతారాముల పుష్కర మహోత్సవ కళ్యాణం పేరిట ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. కార్యక్రమంలో శ్రీ రామాలయ కమిటీ సభ్యులు,హిందు బంధువులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *