మిట్టకందల గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ గ్రామ సర్పంచ్ ఆకస్మిక తనిఖీలు

సిరా న్యూస్,పాములపాడు;
నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్ట కందల గ్రామంలో మిట్టకందాల గ్రామ పంచాయతీ సెక్రటరీ కృష్ణప్రియ గ్రామ సర్పంచ్ చింతల నారాయణ సచివాలయ సిబ్బందితో కలిసి ఆంజనేయస్వామి గుడి నుండి బ్రహ్మయ్య ఇంటి వద్దకు సిమెంటు రోడ్లపై విచ్చలవిడిగా నీరు పోయితున్నారు అని చిన్న పిల్లలు స్కూల్కు వెళ్లడానికి వృద్ధులు నడవడానికి ఇబ్బందికరంగా నీళ్లు రోడ్లపై పోస్తున్నారని అలాగే శనివారం సంత చేసుకొనే సంతలోకి ఇళ్లలోని నీరు కూరగాయల క్రిందకు వస్తూ ఉంటే అలా బజార్లలో నీళ్లు వదిలే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామ పంచాయతీ సెక్రెటరీ కృష్ణప్రియ తెలియజేశారు నాయి బ్రాహ్మణ సందు నుండి విచ్చలవిడిగా నీరు పోయిచున్నారని ఇంటింటి వద్దకు వెళ్లి తెలియజేయడం జరిగింది అలాగే దారిలో నీరు వదిలే వారికి నోటీసులు పంపిస్తామని తెలియజేశారు అలాగే సర్కార్ బడి వద్దనుండి నీరు పోవడానికి కాలువలు తీయిస్తామని స్కూలు వద్ద నీరు ఆగకుండా ట్రాక్టర్లతో రాళ్లు మట్టి తోలుస్తామన్నారు అలాగే పెద్ద బావిలో కొంతమంది ఇళ్ల యజమానులు ఇళ్లలోని చెత్త హోటల్ లోని మిగిలిన కూరలు చట్నీలు బావిలో వేస్తూ గలీజ్ చేస్తున్నారని దుర్వాసనలు వస్తున్నాయని అలా బావిలో వేసిన వారిపై కూడా నోటీసులు జారీ చేస్తామన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *