సిరాన్యూస్, కుందుర్పి
ఏపీలో మళ్లీ ఎగరబోతున్న వైయస్‌ఆర్‌సీపీ జెండా
* ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలారి రంగయ్య
ఏపీలో మళ్లీ వైయస్‌ఆర్‌సీపీ జెండా ఎగరబోతుందని అనంతపురం పార్లమెంట్ సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గం వైయస్ ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలారి రంగయ్య అన్నారు. మంగళవారం కుందుర్పి మండల కేంద్రం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనూతన కార్యాలయంలో కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈసమావేశాని ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. నాయకులు కార్యకర్తలు కలిసి మెలిసి ఉండాలని సమన్వయంతో కలసి పార్టీకి పని చేయాలని, కార్యకర్తలే పార్టీకి నమ్మకం బలమని తెలిపారు. రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ప్రతి గ్రామం లో వారి వారి పోలింగ్ బూత్ లలో రోజుకు కనీసం 60 ఇండ్లను ఉదయం, సాయంత్రం వెళ్లి ముఖ్యమంత్రి, 2019 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు పేరిట సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. ఈ కార్యక్రమం లో పార్టీ మండల కన్వీనర్లు, ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు