సిరాన్యూస్, చిగురుమామిడి
రైతులకు అందుబాటులో జిలుగు విత్తనాలు:వ్యవసాయ అధికారి రంజిత్ కుమార్
పంట పొలాలకు ఎరువులుగా ఉపయోగపడే జిలుగు విత్తనాలను చిగురుమామిడి మండల కేంద్రంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి రంజిత్ కుమార్ ప్రకటనలో తెలిపారు. కావాల్సిన ప్రతి రైతు పట్టా పాసుబుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తో డీసీఎంఎస్ కార్యాలయానికి రావాలని తెలిపారు. 30 కిలోల బస్తా సబ్సిడీపై రూ.1,116 రూపాయలకు అందిస్తున్నట్లు తెలిపారు.