విద్యార్దుల నిరసన ర్యాలీ
సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల జిల్లా ముచ్చుమర్రి లో మైనర్ బాలిక పై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కోవెలకుంట్ల పట్టణంలో ఎస్ఎఫ్ఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు విద్యార్థులు గ్రామపంచాయతీ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు పలికారు అనంతరం సిఐటియు నాయకులు సుధాకర్ మాట్లాడుతూ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు … భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండాప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు … బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.