నిందితుల అరెస్టు
సిరా న్యూస్,హైదరాబాద్;
రన్నింగ్ బస్సులో భాధితురాలి రేప్ కి గురైనట్టు అర్ధరాత్రి ఫిర్యాదు చేసిందని ఈస్ట్ జోస్ టీపీసీ బాల స్వామి అన్నారు. – హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించిన నెల్లూరు కి చెందిన ఈర్ల కృష్ణ బాబు, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్దయ్య అనే ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేశాం. చేగుంట లో భోజనం చేసిన తరువాత సిద్దయ్య డ్రైవ్ చేశాడు. కృష్ణబాబు బాధితురాలిని రేప్ చేశాడు , సిద్దయ్య అతనికి సహకరించాడు. బాధితురాలితో మాటలు కలిపి అఘాయిత్యం చేసారు. బాధితురాలి తన కూతురు తో కలిసి ప్రయాణిస్తుంది కానీ ఒకే బెర్త్ బుక్ చేసుకుంది. దాంతో వెనకాల ఉన్న బెర్త్ లోకి వెళ్ళాలని నిందితుడు చెప్పాడు. 64 (1) బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. మంగళవారం న్న యాచారం స్టేషన్ పరిధిలో నిందితులను అరెస్టు చేశాం. నిందితులను ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. బాధితురాలి భర్త 7 ఏళ్ల క్రితం మరణించారని అన్నారు.