సిరా న్యూస్,పెద్దపల్లి;
ఓ మైనర్ బాలిక పై అత్యాచారం జరిగిన ఘటన పెద్దపల్లి జిల్లా లో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన బెడ బుడగ జంగాల కు చెందిన ఓ మైనర్ బాలికను(17) అదే పట్టణానికి చెందిన ఆలకుంట మధుకర్ అనే యువకుడు అత్యాచారం చేశాడంటూ బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షలకు ఆసుపత్రి కి పంపించిన పోలీస్ లు బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.