13 మందికి గాయలు
భీమనపల్లి గురుకలంలో ఘటన
సిరా న్యూస్,నల్గోండ;
దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామ శివారులోని బీసీ బాలుర గురుకుల పాఠ శాల లోనిద్రిస్తున్న విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయి. దీంతో 13 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. స్థానికులు స మాచారంతో ఈ విషయం బయట పడింది.
ఘటనలో విద్యార్థులు పి గౌతమ్ , ఏ శివ సాయి, పి మల్లికా ర్జున్, జి సంజయ్, జి శ్రీనిధి, జి సిద్దు, ఏం శివ, వి అభిషేక్, ఆర్ విగ్నేష్, పి. వంశీ, ఏం నిఖిల్, ఎం భరత్ లకు గాయాలయ్యయి. బీసీ గురుకుల పాఠశాల అపరిశుభ్రంగా ఉండడం వల్లే ఎలుకలు ఎక్కువగా చేరుతు న్నాయని విద్యార్థులు తెలిపారు. విషయాన్ని విద్యార్థులు అధ్యాపకుల దృష్టికి తీసుకు వెళ్లడంతో పాఠశాల హెల్త్ సూపర్ వైజర్ 13 మంది విద్యార్థులను తూర్పు పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అంద జేశారు.