సిరా న్యూస్,బి కొత్తకోట;
ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ లోని మూడవ మలుపు వద్ద ప్రయివేట్ బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనున్న బండరాయిని ఢీకొంది. చిన్నమండెం నుండి పర్యాటకులతో ఆదివారం హార్సిలీహిల్స్ ను సందర్శించి తిరుగు ప్రయాణంలో రాత్రి మూడవ మలుపు వద్ద బ్రేకులు ఫెయిల్ అవడంతో ఘటన చోటుచేసుకుంది. బస్సులో దాదాపు 40 మంది పైగా పర్యాటకులు ఉండగా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.