సిరా న్యూస్,హైదరాబాద్;
బెంగళూరు రేవ్ పార్టీ నిషా ఇప్పుడు పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. నెల్లూరు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. బర్త్ డే పార్టీ కాస్తా రాజకీయ సవాళ్లకు తెరతీసింది. రేవ్ పార్టీ కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో జరిగిందన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలకు ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చారు మంత్రి. ఇద్దరం బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం.. ఎవరిది రేవ్ పార్టీ కల్చరో తేలుతుందని సవాల్ విసిరిన కాకాణి 24 గంటల డెడ్‌లైన్ విధించారు. కలర్ జిరాక్స్ తీయించుకొని ఎవరి కారుపైనో అంటించుకుంటే తన వాళ్లు అవుతారా అని ప్రశ్నించారు. రేవ్ పార్టీలో తానూ, తన వాళ్లూ ఉన్నారని ప్రచారం చేస్తున్నారు.. నిరూపించగలరా ప్రశ్నించారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆ పార్టీలో ఉన్న వాళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న కాకాణి.. ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. సప్తవ్యసనాలు సోమిరెడ్డికి ఉన్నాయన్న కాకాణి ఎన్నికల్లో నీతో పోటీ పడటం తన దురదృష్టమన్నారు.మంత్రి వాదన ఇలా ఉంటే.. కాకాణి పేరుతో ఉన్న కారు రేవ్ పార్టీ దగ్గర ఎందుకుంది? కారు మంత్రికి చెందినది కాదనకుంటే కాకాణి పేరుతోనే స్టిక్కర్ ఎందుకు ఉందనేది సోమిరెడ్డి స్ట్రయిట్ క్వశ్చన్. అంతకు మించి మరో అడుగు ముందుకు వేసిన సోమిరెడ్డి.. కాకాణి కనుసన్నల్లోనే రేవ్‌పార్టీ జరిగిందని ఆరోపిస్తున్నారు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్‌హౌస్ నిర్వాహకుడు గోపాల్‌రెడ్డి కాకాణికి స్నేహితుడు కాదా అని ప్రశ్నిస్తున్నారు. జూన్ 4 తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి ఆధారాలు సమర్పించి విచారణ కోరుతానన్నారు.
టాలీవుడ్ లోనూ..
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బెంగళూరు రేవ్ పార్టీ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ నటీనటులు పాల్గొన్నట్లు వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. అందులో నటి హేమ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ‘నేనేమీ ఆ పార్టీకి హాజరు కాలేదు’ అంటూ ఆమె బుకాయిస్తన్నప్పటికీ.. రేవ్ పార్టీకి తెలుగు సినీ నటి హేమ హాజరైనట్లు నగర పోలీసు కమిషనర్ దయానంద్ స్పష్టం చేశారు. దీంతో జనాలను చీట్ చేయాలని చూసిన హేమపై నెట్టింట ట్రోల్స్ పేలుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో మరో నటి కరాటే కల్యాణీ హేమపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇండస్ట్రీ వాళ్లను ఉద్దరిస్తున్నట్లు కలరింగే ఇచ్చే హేమ నిజ స్వరూపం ఇప్పుడు బట్టబయలు అయిందని కల్యాణీ చెప్పుకొచ్చారు. ఫ్రెండ్స్‌తో సరదాగా పేకాడుతూ దొరికితే.. తానేదో పెద్ద తప్పు చేసినట్లు బిల్డప్ ఇచ్చిందన్నారు. మనం ఏం చేస్తే అది తిరిగి వస్తుందని.. లా పనిష్మెంట్స్ తీసుకోడానికి హేమ రెడీగా ఉండాలన్నారు కల్యాణీ. అయితే హేమ డ్రగ్స్ కేసు నుంచి బయటకు రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు