సిరాన్యూస్, ఓదెల
మహిళ శక్తి సెంటర్ ను సందర్శించిన జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం లోని కనగర్తి ,ఓదెల గ్రామం లో సేర్ప్ మహిళా సంఘాల ద్వారా నిర్వహించబడుతున్న మహిళా శక్తి సెంటర్ ను గురువారం పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ సందర్శించారు. అనంతరం మహిళా ట్రైలర్స్ కు తగు సలహాలు సూచనలు చేశారు.అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ లో ఓదెల జిల్లా పరిషత్ స్కూల్ ను సందర్శించి, పనులను పరిశీలించారు. మహిళా శక్తి సెంటర్స్ ద్వారా పంపిణీ చేసే యునిఫామ్స్ గురించి విద్యార్థులను అడిగి తెలుసు కున్నారు. అలాగే నాంసానిపల్లి గ్రామానికి మహిళా శక్తి కింద మంజూరైన మీసేవ కేంద్రానికి బిల్డింగ్ పరిశీలించారు. కార్యక్రమం లో ఎంపీడీఓ తిరుపతి, ఏఈ పీఆర్ సమ్మిరెడ్డీ, ఏపీఎం లతా మంగేశ్వారీ సీసీ లు మారేళ్ల శ్రీనివాస్, కొమురయ్య, విజయ, ఈసి శ్వేత, టిఏ జనార్ధన్, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.