సిరాన్యూస్, సైదాపూర్
నష్టపరిహారం చెల్లించాలి
* మండల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు సందుపట్ల రవీందర్ రెడ్డి
* రైతు దీక్షలకు మద్దతు
పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరాకు 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సైదాపూర్ మండల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు సందుపట్ల రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు కంది ప్రసాద్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీల నిర్లక్ష్యానికి కారణంగా కరీంనగర్ జిల్లాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ తలపెట్టిన రైతు మంగళవారం దీక్షకు సైదాపూర్ మండల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు సందుపట్ల రవీందర్ రెడ్డి సీనియర్ నాయకులు కంది ప్రసాద్ రెడ్డిపాల్గొన్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరాకు 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.