Ravinder Reddy:బీజేపీలో చేరిన పీఏసిఎస్ డైరెక్టర్ ఏనుగు రవీందర్ రెడ్డి

సిరా న్యూస్, నేర‌డిగొండ‌
బీజేపీలో చేరిన పీఏసిఎస్ డైరెక్టర్ ఏనుగు రవీందర్ రెడ్డి
* గొడం నగేష్ గెలుపు కోసం కృషి

నేరడిగొండ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ తేజాపూర్ పీఏసిఎస్ డైరెక్టర్ ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గురువారం బీజేపీలో చేరారు. వారికి బీజేపీ మండల అధ్యక్షులు సాబ్లే సంతోష్ సింగ్ , మాజీ జడ్పీటిసి గడ్డం భీంరెడ్డిలు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం, సనాతన ధర్మ రక్షణ కేవలం బీజేపీ ద్వారానే సాధ్యమని తెలిపారు. కాంగ్రెస్ యొక్క హిందూ వ్యతిరేక ధోరణి నచ్చక, అక్కడ ఉండడం మనసొప్పక, తనకు ధర్మం కంటే ఎక్కువ పార్టీ కాదని తెలిపారు. అందుకే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీని వదిలి నరేంద్రమోడీ నాయకత్వంలో పనిచేయాలని బీజేపీలో చేరడం జరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి గొడం నగేష్ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు రాఘవులు, రాజశేఖర్, నాయకులు పరుశురాం, గట్టు నారాయణ, వెంకటేష్, భూమేష్ చారి, భోజన్న, నవీన్ చారి, వినోద్, సుధీర్, ఉషన్న, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *