సిరా న్యూస్, ఓదెల
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం
ఓదెల మండల కేంద్రానికి చెందిన నిరుపేద స్వర్ణకారుల కుటుంబంలోని ఆడబిడ్డ పెండ్లికి ఓదెల మండల స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు వెలి షోజు రవీంద్ర చారి రూ.5116 ఆర్థిక సాయం అందించారు. గురువారం వెలిషాజు ఉమాదేవి, శంకరాచారిల దంపతుల రెండవ కుమార్తె వివాహానికి గాను ఆర్థిక సాయం అందజేశారు. అలాగే కమాన్ పూ ర్ మండలం స్వర్ణకారుల సంఘం వారు 25 కిలోల బియ్యం అందించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెలి శోజు శ్రీధర్, కోశాధికారి కొండపాక నరసింహాచారి, దేవరకొండ సతీష్, వెళ్లి సోజు శ్రీనివాసు, మునిగంటి సత్యనారాయణ, వెలిశోజు సదానందం, విజయగిరి శ్రీనివాస్, బాణాల సూర్యనారాయణ ఉన్నారు.