సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ మైదానంలో బుధవారం హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్ కుమార్ గారు హోంగార్డ్స్ పరేడ్ తనిఖీ చేశారు.అనంతరం దర్బార్ పరేడ్ సందర్భంగా.. కమాండెంట్ మాట్లాడుతూ హోమ్ గార్డులు పోలీస్ శాఖతో పాటు పలు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నారని, పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల ప్రశంశలు అందుకుంటున్నారన్నారు. విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే సబ్ డివిజన్ హోంగార్డు ఇంచార్జులకు గాని, లేదా రిజర్వ్ ఇన్స్పెక్టర్ కు గానీ, తీవ్రమైన సమస్య ఎదురైనప్పుడు. ఆర్ఐ గారి ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని, సమస్యను సకాలంలో గుర్తించి వైద్య చికిత్స తీసుకోవాలని ఆయన సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలన్నారు. హోమ్ గార్డ్స్ సంక్షేమానికి చేపట్టిన చర్యలను వివరించారు.