సిరా న్యూస్,విజయవాడ;
ఉమ్మడి కృష్ణా జిల్లాలో కురిసిన భారీ వర్షం విజయవాడ సమీపంలోని రాయ నపాడు రైల్వేస్టేషన్ ను ముంచేసింది. రైల్వే ట్రాక్, స్టేషన్ పరిసరాలన్నీ వరద నీటిలో ముని గిపోయాయి. సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పై సుమారు ఆరు అడు గుల ఎత్తులో వరద ఉద్ధృతంగా ప్రవహి స్తోంది. రైల్వే ట్రాక్ పెద్ద ఎత్తున కోసుకు పోయింది. హైద రాబాద్, విశాఖ వైపు వెళ్లే రైళ్లన్నీ స్టేషన్ లో నిలిపేశారు. హైద రాబాద్ నుంచి విశాఖ వెళ్లే గోదావరి, హైదరాబాద్ – చెన్నై వెళ్లే చార్మినార్ ఎక్స్ ప్రెస్ లను రైల్వే శాఖ నిలిపేసింది. ప్రయా ణికులను రైల్వేస్టేషన్ నుంచి పడవల్లో గుంటుపల్లికి తరలించి అక్కడి నుంచి 50బస్సుల్లో విజయవాడకు పంపించారు.