సిరా న్యూస్,రాజమండ్రి;
కొత్త వెహికల్స్ కొనేవారికి, లైసెన్స్‌లు తీసుకునేవారికి రాష్ట్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు స్మార్ట్ కార్డుల్లో ఇవ్వనున్నట్లు రవాణా శాఖ తెలిపింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుంది. రాష్ట్రంలో ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లు స్మార్ట్‌కార్డుల్లో రానున్నాయి. కొత్త వెహికల్స్ కొనేవారికి, లైసెన్స్‌లు తీసుకునేవారికి రాష్ట్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని రవాణా శాఖలో స్మార్ట్ కార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. స్మార్ట్ కార్డుల సరఫరాకు టెండర్ల పిలిచేందుకు ప్రక్రియ మొదల పెట్టింది.కొత్త వాహనం కొనుక్కుని, రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక ఇచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ), డ్రైవింగ్ లైసెన్స్ పొందినప్పుడు అందజేసే డీఎల్ కార్డుల జారీకి ప్రక్రియ ప్రారంభం అయింది. నవంబర్ నెల నుంచే కార్డులు జారీ చేయనున్నారు. రాష్ట్రంలో రోజుకు సగటున 10-12 వేల ఆర్సీ, డీఎల్ కార్డుల చొప్పున నెలకు మూడు లక్షలు, ఏడాదికి దాదాపు 36 లక్షల కార్డులు అవసరం అవుతాయి. గతంలో జిల్లా రవాణా శాఖ, ఆర్టీవో కార్యాలయాల్లో వాటిపై వివరాలు ముద్రించి, వాహనదారుల ఇళ్లకు స్పీడ్ పోస్టులో పంపేవారు. దీనికోసం రూ.200 ఫీజు, స్పీడ్ పోస్టు ఖర్చు కూడా వసూలు చేసేవారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్మార్ట్ కార్డుల జారీకి రవాణా శాఖను ఆదేశించింది. నవంబర్ మొదటి వారం నుంచి వాహన్, సారథి పోర్టల్‌లో ఈ కార్డుల కోసం ఆప్షన్ ఇవ్వనున్నారు. దీనికి రూ.200 ఫీజుతో పాటు, స్పీడ్‌పోస్టు ఛార్జి రూ.35 ఆన్‌లైన్‌లోనే తీసుకుంటారు. స్మార్ట్ కార్డుల సరఫరాకు టెండర్లు పిలిచేందుకు రవాణా శాఖ దస్త్రం సిద్ధం చేసింది. దానిని ప్రభుత్వానికి పంపింది. అక్కడి నుంచి క్లియరెన్స్ రాగానే టెండర్లు పిలిచి, సరఫరాదారును ఎంపిక చేస్తారు.జూలై నుంచి ఈ విధానాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఆర్‌సీతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆన్‌లైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని జెరాక్స్ కాపీ వాహనదారుల వెంట ఉంచుకుంటే సరిపోతుందని ఆదేశాలు ఇచ్చింది. కాకపోతే వాహనదారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడ తనిఖీల సమయంలో ఆర్సీ, డీఎల్ కార్డులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం మళ్లీ స్మార్ట్ కార్డులను జారీ చేసేందుకు సిద్ధమైంది.దీంతో వాహనదారుల జోబుల్లో మరోకార్డు పెరగనుంది. వర్షాలు వచ్చే సమయంలో ఇబ్బందులు పడనక్కరలేదు. ఇది వరకు కాగితపు ధ్రువీకరణ పత్రం వర్షాలు పడితే తడిచిపోయేది. స్మార్ట్ కార్డులు వస్తే, వర్షం భయం నుంచి వాహనదారులు బయటపడతారు. దీంతో వాహనదారులకు అదనంగా కొంత ఖర్చు అవుతుంది. దాదాపు 250 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఖర్చు అయినప్పటికీ స్మార్ట్ కార్డుతో ఉపయోగాలు ఎక్కువని వాహనదారులు భావిస్తోన్నారు.