సిరాన్యూస్, కళ్యాణదుర్గం
ప్రజలకు అందుబాటు ధరలో నిత్యావసర సరుకులు: ఆర్డీఓ రాణి సుస్మిత
* రైతు బజార్లు, రిటైల్ దుకాల అమ్మకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని అల్లుడు ధర్మ తేజ
రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు కందిపప్పు, సోనా మసూర బియ్యం అందించాలనే ఉద్దేశ్యంతో ధరలు తగ్గించి వాటి విక్రయాలు ప్రారంభించారు. గత ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ చేయకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు, మిల్లర్లతో చర్చించి వాటిని ప్రభుత్వం ప్రతి రిటైల్ దుకాణాలు, రైతు బజార్లలో అందుబాటులోకి తెచ్చింది. వాటిని శనివారం కళ్యాణదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆదేశాలతో ఆయన అల్లుడు దేవినేని ధర్మ తేజ, ఆర్డీఓ రాణి సుస్మిత ప్రారంభించారు. బయట మార్కెట్లో కందిపప్పు 181 రూపాయలు ఉండగా ప్రభుత్వం 160 రూపాయలకు, సోనా మసూర బియ్యం బయట 55.85 రూపాయలు ఉండగా వాటి ధరను 49 రూపాయలకు విక్రయించనున్నారని తేజ పేర్కొన్నారు.