చివరి దశకు చేరుకున్న కార్తీక మాసోత్సవాలు

ఆఖరి సోమవారం శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

సిరా న్యూస్,విజయవాడ;
పవిత్ర కార్తీక మాసోత్సవాలు చివరి దశకు, చివరి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శైవ క్షేత్రాలు శివ నామస్మరణలతో మారుమోగాయి. గుడివాడ పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో తెల్లవారుజాము నుండే వేలాదిగా భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు దేవాలయాలకు చేరుకోగా, వేద పండితులు స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పుణ్యస్నానాలు ఆచరించిన మహిళా భక్తులు దేవస్థాన ప్రాంగణంలో స్వామివారికి కార్తీక దీప పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులు తీర్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *