హోంమంత్రి అనిత
సిరా న్యూస్,అమరావతి;
ఎపి రాష్ట్ర పోలీస్ శాఖలో 20వేల సిబ్బంది కొరత ఉందని హోంమంత్రి అనిత వెల్లడించారు. కోర్టుల్లో కేసుల కారణంగా కానిస్టేబుళ్ల నియామకం నిలిచిపోయింది. వివాదం పరిష్కారం కాగానే నియామకాలు చేపడతాం. అని శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చెప్పారు. 2024 నాటికి రాష్ట్రంలో బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులు 46,538 నమోదయ్యాయని, ట్రేసవుట్ కాని కేసుల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.