Reddy Sangam Adilabad: రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు హర్షణీయం

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు హర్షణీయం

రెడ్డి కార్పోరేషన్‌ ఏర్పాటు చేయడం హర్షణీయమని ఆదిలాబాద్‌ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లా నారాయణ్‌ రెడ్డి, గోపిడి రాంరెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌ పట్టణంలోని రెడ్డి సంఘ భవనంలో ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం గావించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సీఎం రేవంత్‌ రెడ్డి, రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీను నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *