సిరా న్యూస్,మేడ్చల్;
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అర్హులైన 213 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష దొరికింది. హైదరాబాద్ చర్లపల్లి కేంద్ర కారాగారంలో 213 మంది ఖైదీలను విడుదల చేసారు. వారికి మార్గదర్శకం మరియూ ఉపాధి కల్పనపై అవగాహన కల్పించి ఉద్యోగ మేళా కార్యక్రమాన్ని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఏర్పాటు చేసారు.. చర్లపల్లి జైలు నుండి 61, ఓపెన్ ఎయిర్ జైలు నుండి 31 మంది ఖైదీలు విడుదల అయ్యారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐజీ వై.రాజేష్, డీఐజీలు మురళీ బాబు, శ్రీనివాసరావు, చర్లపల్లి జైలు సూపరిండెంట్ సంతోష్ రాయ్, ఓపెన్ జైలు సూపరిండెంట్ సమ్మయ్య, చంచల్ గూడ సూపరిండెంట్ శివకుమార్ గౌడ్, చర్లపల్లి జైలు అధికారులు, ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
===