సిరా న్యూస్,పిఠాపురం;
పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధితులకు ముందుగానే శిబిరాల్ని ఏర్పాటుచేసి,అక్కడ వారికి అవసరమైన త్రాగునీరు,ఆహారం,వైద్యం సహాయక చర్యలు అందించి ఆదుకోవాలని వైఎస్సార్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్,మాజీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.
పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు,కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు.పార్టీ శ్రేణులు కూడా వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వంగా గీతావిశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు..సమావేశంలో గండేపల్లి బాబీ,రావుల మాధవరావు,బత్తుల సాయి,ఉలవల భూషణం,కొత్తెం దత్తుడు,పెదపాటి రాజేశ్,సామరౌతు లలిత,గ్రంధి గణేశ్,పితొని కాశీ,వరదా శేషు తదితరులు పాల్గొన్నారు..