గుర్తు తెలియని వ్యక్తులచే భూలక్ష్మి ప్రతిమ తొలగింపు.

జూలపల్లిలో విగ్రహ ప్రతిష్టాపన

 సిరా న్యూస్,కమాన్ పూర్;

కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి భూలక్ష్మి విగ్రహాన్ని ఎట్టుకెళ్లిన గుర్తుతేలియని వ్యక్తులు అక్కడికి కొంత దూరంలో గడ్డి వాము ప్రక్కన చెట్ల పొదల్లో వదిలిపెట్టారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి వచ్చిన ఎస్. ఐ కొట్టె ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చేపట్టాగా చెట్ల పొదల్లో లభించింది. అనంతరం పంబాల వాళ్ళు భూలక్ష్మి విగ్రహాన్ని ప్రత్యేక పూజలా మధ్య పునః ప్రతిష్ట చేశారు. కాగా ఈ దురాగతానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామ నికి చెందిన పలువురు విలేకరుల సమావేశంలో కోరారు. ఈ సమావేశంలో పోల్దాసరి సాయికుమార్ చొప్పరి తిరుపతి బర్ల సదానందం బొమ్మగాని అనిల్ కుమార్ మారబోయిన ముత్యాలు కుమార్ ఇరుగురాళ్ల తిరుపతి చొప్పరి గట్టయ్య ఎలబోయిన రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *