ప్రగతి భవన్ చుట్టూ ఉన్న భారీ కేడ్లు తొలగింపు

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో నిన్న మొన్నటి వరకూ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న ప్రగ తిభవన్ వద్ద మార్పులు చేర్పులుచోటుచేసు కుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మారుస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ వద్ద బారికేడ్లను పోలీసులు తొలగిస్తున్నారు.ఇప్పటి వరకూ ప్రగతి భవన్ వద్ద అమలులో ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను సైతం ఎత్తి వేశారు. ప్రగతి భవన్ వద్ద బారికేడ్లు రోడ్డులో సగభాగాన్ని ఆక్ర మించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోనున్నాయి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *