– ప్రమాదంగా మారిన ట్రాన్స్ఫర్
– ఇంట్లోకి వెళ్లాలంటే ట్రాన్స్ఫార్మర్ ని దాటాల్సిందే
– పలుమార్లు ఉన్నతధికారులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు
సిరా న్యూస్,ములుగు;
ములుగు మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన గట్ల రవి అనే బాధితుడు తన ఇంటి ఎదురుగా ఉన్న ట్రాన్స్ఫార్మ్ తొలగించమని పలుమార్లు మండల అధికారులతో పాటు,జిల్లా ఉన్నతధికారులకు వినతులు సమర్పించిన పట్టించుకోవడంలేదని వాపోతున్నాడు.జాతీయ రహదారి పక్కన ఉన్న తన ఇంటికి ముందు వ్యవసాయ బావులకు సరఫర చేసి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉందని,తన ఇంటి నేరుగా ఉండటంతో ఇంట్లోకి వచ్చే వెళ్లే క్రమంలో అది ఎప్పుడు ఎవరికీ తాకి ప్రమాదం సంభవిస్తుందోనన్న భయంతో వనిగిపోతున్నామని, ట్రాన్స్ఫార్మర్ వల్ల రోడ్డుపక్కన వెళ్తున్న పశువులు సైతం గతంలో మృత్యువాత పడ్డాయని బాధితుడు తెలిపాడు. ట్రాన్స్ఫార్మర్ భూమికి తక్కువ ఎత్తులో ఉండడం వల్ల వర్షాకాలంలో వరదలు సంభవించినప్పుడు, ట్రాన్స్ఫార్మర్ కరెంట్ వైర్లకు వర్షపు నీరు తాకుతూ వెళ్లడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉందని, వర్షాలు పడుతున్న సమయంలో ట్రాన్స్ఫారం నుంచి విద్యుత్ మెరుగులు పడుతుండటంతో భయం భయంగా గడపాల్సి వస్తుందని తెలిపాడు. ట్రాన్స్ఫార్మర్ అడ్డుగా ఉండడంతో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పనులు చేస్తున్న సిబ్బంది తన ఇంటి ముందు డ్రైనేజ్ వేయకుండా నిలిపి వేశారని, ట్రాన్స్ఫార్మర్ను తొలగిస్తే తప్ప డ్రైనేజీ నిర్మించమని తెగేసి చెప్తున్నారని, విద్యుత్ శాఖ వారిని ట్రాన్స్ఫార్మర్ తొలగించమని అడిగితే పొంతన లేని సమాధానం చెప్తూ దాట వేస్తున్నరని బాధితుడు వాపోతున్నాడు.గత సంవత్సరకాలం నుండి ఉన్నతాధికారుల కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరుగుతూ వినతులు సమర్పిస్తున్నప్పటికీ,కనీసం ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడంలేదని బాధితుడు తెలుపుతున్నాడు.ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్ఫారం ప్రమాదం నుంచి తన కుటుంబంతో పాటు, తన ఇంటికి వచ్చి వెళ్లే ఇరుగుపొరుగు వారికి కూడా ప్రమాదం సంభవించకుండా తక్షణమే ట్రాన్స్ఫార్మర్ ని తన ఇంటి ముందు నుంచి తొలగించి,తమ ప్రాణాలకు రక్షణ కల్పించవలసిందిగా చర్యలు తీసుకొవాలని అధికారులను వేడుకుంటున్నారు.