సిరా న్యూస్, బేల:
రెపరెపలాడినా త్రివర్ణ పథకాలు..
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా బేల గ్రామ నడిబొడ్డున ఉన్న జెండాను ధకాతే దేవరావ్ ఎగురవేశారు. సర్పంచ్ చంద్రశేఖర్, గణేష్ బొంగిర్వార్ , దేవన్న ఒలపవార్, మస్కే తేజ్ రావ్ వార్డ్ వార్డ్ మెంబర్లు యువకులు పాల్గొన్నారు. బేల పోలీస్ స్టేషన్లో ఎస్సై రాధిక చిత్రపటాలకు పూల మాల వేసి త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. స్థానిక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ వట్పెళ్లి ఇంద్రశేఖర్ అంబేద్కర్ గాంధీ భరతమాత చిత్ర పటాలకు పూలమాలవేసి జండా ఎగురవేశారు అనంతరం గణతంత్ర దినోత్సవం గురించి తెలియజేశారు వార్డ్ నెంబర్లు నాయకులు గ్రామస్తులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సవేసింగ్ చిత్రపటాలకు పూల మాల వేసి జెండా ఎగురవేశారు. డిప్యూటీ తహసీల్దార్, ఆర్,ఐ, ఆఫీస్ బృందం, అధికారులు నాయకులున్నారు.
ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మహేందర్ అంబేద్కర్, గాంధీ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటిస్తూ జెండాను ఎగురవేశారు. ఎంపీపీ వనిత ఠాక్రే, జడ్పీటీసీ అక్షిత పవార్, మాజీ ఎంపీపీ రఘుకుల్ రెడ్డి, సర్పంచ్ ఇంద్రశేఖర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, నాయకులు తేజ్ రావ్ మస్కే, సతీష్ పవర్, దేవన్న ఒలోపర్, కిరణ్ ముక్కావర్, రాందాస్ నాక్లే, విట్టల్ దేవతలే తదితర నాయకులు న్నారు. మండల కేంద్రంలోని పలు పాఠశాలల్లో ణతంత్ర వేడుకలు జరిగాయి విద్యార్థులకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి విద్యార్థులు ఉపన్యాసాలతో కొనియాడారు.