సిరా న్యూస్, బేల:
త్రీఫేస్ విద్యుత్ కోసం కలెక్టర్‌కు వినతి…
బేల మండలంలోని పలు గ్రామాలకు త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని యువజన కాంగ్రెస్,ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు డిమాండ్ చేసారు. సోమవారం ఈ మేరకు ప్రజా ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ… బేల మండలంలోని దేవుజీగూడ, కడ్కి, సదల్ పూర్, వరుర్, గ్రామాల్లోని చేన్లలో బోరు బావులు ఉన్నప్పటికీ త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయా గ్రామాల రైతులకు తమ పంటలకు నీళ్లు అందించే పరిస్థితి లేదన్నారు. ఆదివాసీ జనాభా అధికంగా ఉన్న ఈ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి, వెంటనే త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట ఆదివాసి సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు ఆడే శంకర్, నాయకులు కొడపబింరావు, నాందేవ్ సీతారాం, తదితరులు ఉన్నారు.