సిరా న్యూస్,పాణ్యం;
పాణ్యo నియోజకవర్గo- గడివేముల మండలం ఆళ్లగడ్డ, భుజునూరు,గ్రంథివేముల గ్రామలలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డి పర్యటించారు. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో గ్రామాలలో అభివృద్ధి చేసే బాధ్యత నాది అని,ఈ వైసిపి ప్రభుత్వం లో ఏ అభివృద్ది జరగలేదు అని,చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి గా గెలిపించుకోవాల్సిన అవసరం మన రాష్ట ప్రజలకు చాలా అవసరం అని అభ్యర్థించారు. బుజునూరు గ్రామానికి సుబ్బారాయుడు తో పాటు 10 కుటుంబాలు గౌరు చరిత రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాసరెడ్డి,మురళీ రెడ్డి,చిందుకురు సర్పంచ్ అనసూయమ్మ, బిలకల గూడూరు రఫిక్,ఫరూఖ్ బుజునురు పంట రామచంద్ర రెడ్డి,దిలీప్ కుమార్ రెడ్డి,బొల్లవరం సుభద్రమ్మ, పెసరవాయి వద్దు లక్ష్మీ దేవీ, గ్రంధి వేముల రామ్మోహన్ రెడ్డి,సుధాకర్ రెడ్డి,రసూల్ జామల్, గని హర్ష,బిలకల గూడూరు ప్రకాష్ రెడ్డి,మరియు టీడీపీ బిజెపి జానసేనా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు