ఎగబడి సంచుల్లో నింపుకపోతున్న ప్రజలు
సిరా న్యూస్,పెద్దపల్లి;
గత కొద్ది రోజులుగా పెద్దపల్లి కూరగాయల మార్కెట్ హోల్సేల్ & రిటైల్ కూరగాయలు వ్యాపారస్తులకు వివాదం ఏర్పడిన నేపధ్యంలో రిటైల్ వ్యాపారులు కూరగాయాలను ఉచితంగా ఇచ్చారు. దాంతో జనాలు ఎగబడి సంచుల్లో నింపుకుపోయారు. హోల్సేల్ వ్యాపారస్తులు రిటైల్ గా అమ్ముతున్నారని కూరగాయల మార్కెట్ బంద్ చేసి వినియోగదారులకు ఫ్రీగా కూరగాయలు అందించారు. హోల్సేల్ వ్యాపారులు వినియోగదారులకు రిటైల్ గా అమ్మడంతో మేము తీవ్రంగా నష్టపోతున్నామని రిటైల్ వ్యాపారస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు ఫ్రీ ఇస్తుండటంతో కూరగాయల కోసం జనాలు బారులు తీరారు.
==========================