మంద కృష్ణ మాదిగ
సిరా న్యూస్,హైదరాబాద్;
రేవంత్ రెడ్డి కి కులతత్వం బాగా పెరిగింది అది వెంటనే తొలిగించుకోవాలి. ఇలానే ఉంటే భవిష్యత్తులో కాంగ్రెస్ అడ్రెస్ లేకుంటా పోతదని ఎమ్మార్పిఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అన్నారు. కులపట్ల అభిమానం ఉండొచ్చు కానీ కులతత్వం ఉండొద్దు. కులతత్వ పోకడల వాళ్ళ తీసుకుంటున్న నిర్ణయాలు ద్వారా అన్ని వర్గాలకి దూరం అవుతున్నాడు. మొదటి రోజు నుంచి ఇంటలిజెన్స్ నుంచి మొదలుకొని అన్ని కీలక ఆఫీసర్ నియామకం లో రెడ్డి కూలతత్వమే కనిపిస్తుంది. ఒక్క సింగల్ కాస్ట్ కి ఎంపీ , ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారా ? అగ్రకులలలో బ్రాహ్మణా ,కమ్మ ,వెలమ వాళ్ళకి అవకాశాలు ఇచ్చారా. నా తరవాత సీఎం గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హులు అని రేవంత్ రెడ్డి అన్నారు .. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అర్హులు అని చెప్పాడు. బీసీ మంత్రి గా కొండా సురేఖ , గిరిజన మంత్రి గా సీతక్క , పొన్నం ప్రభాకర్ , దామోదర్ రాజనరసింహ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నువ్వే గెలిపించినట్టు అధిష్టానం నమ్మింది అందుకే సీఎం గా చేసారు. నీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని హైకమాండ్ భ్రమలో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేస్ విచారణ లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని సాంబ శివ రెడ్డి నే నియమించారు. రెడ్డియేతర ఆఫీసర్స్ పట్ల నమ్మకం లేదా ? నామినేషన్ కి ఒక్క రోజు గడువు ఉన్న ఇంకా ఖమ్మం , కరీంనగర్ , హైదరాబాద్ లో ఎందుకు ఏకాభిప్రాయం రాలేదు .. ఎస్సీ రిజర్వేషన్ స్థానంలో ఎలా ఏకాభిప్రాయం వచ్చిందని ప్రశ్నించారు.