సిరాన్యూస్,కాల్వ శ్రీరాంపూర్
రెవెన్యూ అధికారి ఎండీ వకీల్‌ను సన్మానించిన మండల రేషన్ డీలర్లు
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి ఇటీవల నూతనంగా వచ్చిన మండల రెవెన్యూ అధికారి ఎండీ వకీల్ ను మంగళవారం శ్రీరాంపూర్ మండల రేషన్ డీలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రెవెన్యూ అధికారి ఎండీ వకీల్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల రేషన్ డీలర్ల అధ్యక్షులు తాండ్ర సురేష్, ముదురుకోళ్ల సదానందం, రమణబోయిన మహేష్, బుర్ర తిరుపతి, దాసి రాజేశం, గూళ్ల రాజు, పెనుగొండ లక్ష్మణ్, గణేష్ తదితరులు ఉన్నారు.