సిరా న్యూస్,అవనిగడ్డ;
కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు అవని గడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, కృష్ణ జిల్లా ఎస్పీ జాషువా మిచాంగ్ తుపాను మీద సమీక్ష సమావేశం నిర్వహిం చారు. అవనిగడ్డ ఎంపీడీఓ కార్యాలయంలో సమావే శమైన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అవనిగడ్డ ఎమ్మె ల్యే సింహాద్రి రమేష్ బాబు అన్ని శాఖ ల అధికారులతో మిచాంగ్ తుఫాన్ రివ్యూ నిర్వహించారు. ఈ సంద ర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ కోడూరు, నాగాయలంక సముద్ర తీర మండ లాలు కావడంతో ప్రజలను పునరా వాస కేం ద్రాలకు తరలించడం, వారికి అన్ని వసతులు కల్పిం చాలని అధికా రులను ఆదేశించారు.రివ్యూ మీటింగ్ అనంతరం నాగాయలంక మండలం ఏటిమొగలో ఏర్పాటుచేసిన పునరా వాస కేంద్రం సందర్శించి అక్క డి ప్రజలతో వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రా ల్లో నాణ్యమైన ఆహారం అందించా లని పునరావాస కేంద్రం నుండి తిరిగి వెళ్ళు నప్పుడు ఒక్కో కుటుంబానికి 2000లు ఒక కుటుంబం నుండి ఓకే వ్యక్తి వస్తే 1000లు అందజేయాలని అన్ని గ్రామా ల్లో వైద్య సేవలు అందుబాటులో ఉండాలని.. అన్ని శాఖల అధికారులు48 గంటలు అందుబాటులో ఉండా లని.. ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా మాట్లాడుతూ దివిసీమలో 200 మంది పోలీ సులను వివిధ సేవలు అందించడానికి ఏర్పాటు చేసామని యస్ డి ఆర్ ప్ రెండు బృందాలు మొత్తం 36 మందిని సిద్ధంగా ఉంచామని పడవలు,గజఈత గాళ్ళును సిద్ధం చేయాలని మత్యశాఖ అధికారులను ఆదేశించారు.