Revitalizing Grievance System: Collector’s Call: ఇక ప్రతీ సోమవారం ప్రజావాణి:

ఇక ప్రతీ సోమవారం ప్రజావాణి..

– తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన కలెక్టర్‌

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని పున: ప్రారంభిస్తున్నట్లు ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం కలెక్టర్‌ పత్రికా ప్రకటన విడుదల చేసారు. అయితే అసెంబ్లీ ఎన్నికల కారణంగా గత రెండు నెలలుగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం కూడ కొలువుదీరడంతో ప్రజావాణికి తిరిగి మోక్షం లభించింది. ప్రజలు తమ సమస్యలను ఎప్పటిలాగే ప్రజావాణిలో విన్నవించుకోవచ్చని కలెక్టర్‌ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఈ నెల 11న సోమవారం కలెక్టరెట్‌ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *