సిరాన్యూస్, ఆదిలాబాద్
ఈనెల 27న ఆర్ఎంపీలకు అవగాహన సదస్సు : ఆర్ఎంపీ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కావటి రమేశ్ యాదవ్
ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలకు ఈనెల 27న అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆర్ఎంపీ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కావటి రమేశ్ యాదవ్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ అధికారి మంగళవారం మధ్యాహ్నం 2.30 డీఎంహెచ్ఓ కాన్ఫరెన్స్ హాల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు తెలంగాణ ఆర్ ఎంపీ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రామోజీ వీరాచారి, ప్రధాన కార్యదర్శి రాళ్ల బండి శంకర్, ఉపాధ్యక్షులు బోజారెడ్డి, గజానంద్ విశ్వనాథ్ మోహన్ అశోక్ బిక్కు రమణ యాదవ్ హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలందరూ సకాలంలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు.