సిరాన్యూస్,ఓదెల
ఆటో బోల్తా… డ్రైవర్ రాజు మృతి
ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలం ఎదులాపూర్ గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు… ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన చలికాని రాజు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఎదులాపురం కు వెళ్తుండగా మైసమ్మ గుడి వద్ద ఆటో బోల్తా పడి రాజు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.