కూతురు మృతి..తండ్రికి తీవ్రగాయాలు
సిరా న్యూస్,హైదరాబాద్;
కులుసంపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పురానా పూల్ వైపు నుండి జియాగూడ వెళ్తుండగా 100 ఫీట్ రోడ్డు వద్ద వేగంగా వచ్చిన డీసీఎం చేతక్ పై వెళ్తున్న తండ్రి కూతురును ఢీకొనడంతో కూతురు నౌషిన్ అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు మరియు పోలీసులు చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి గల కారణాలు పరిశీలిస్తున్నారు. నోషిన్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.