ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం
సిరా న్యూస్,ఖమ్మం;
రోడ్డు భద్రతా మాసోత్సవల్లో భాగంగా ఖమ్మం నగరంలో ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా ఆటోలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ సారంగపాణి అన్నారు. ఆటో డ్రైవర్లు, సంఘాలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని రైల్వేస్టేషన్, బస్టాండు, వైరా రోడ్డు ప్రాంతాల్లో నిత్యం ప్రయాణికులు, ఆటోలతో రద్దీగా ఉంటుందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, మితిమీరిన వేగంతో నడపవద్దన్నారు. కార్యక్రమంలో సీఐ అశోక్, ఆర్ఎస్ఐ సాగర్, ఎస్ఐ రవి పాల్గొన్నారు.