అడ్డుకున్న చిరు వ్యాపారులు
సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా వైరామున్సిపాలిటీ పరిధిలో వైరా రింగ్ రోడ్డు నుండి మధిర వెళ్లే జాతీయ రహదారి విస్తరణ చేసేందుకు నిధులు మంజూరు కావడంలో అధికారులు రంగంలోకి దిగారు. ఆర్ అండ్ బి స్థలాలు ఆక్రమించిన వ్యాపారుల సముదాయాలను తొలగించేందుకు ఆర్ అండ్ బి శాఖ అధికారులు ప్రయత్నం చేసారు.అక్కడున్న చిరు వ్యాపారులు కూల్చివేతను అడ్డుకున్నారు.
=========