సిరా న్యూస్, గొల్లప్రోలు:
భారీ వర్షంతో జలమలమైన రోడ్లు..
మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం నుంచి భారీ వర్షాలు కురిస్తుండటంతో వాగులు వంకలు పొంగి పోర్లుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గొల్లప్రోలు పట్టణంలోని ప్రధాన రహదారులంత జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో నగర పంచాయతీ అప్రమత్తమైంది. రోడ్లపై నీరు నిలువలేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు నీటిని కాలువల ద్వారా బయటకు పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.