రహదారిపై వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం
సిరా న్యూస్,పుట్టపర్తి;
ఉమ్మడి అనంతపురం జిల్లా, పుట్టపర్తి, కొత్తచెరువు మండలాల్లో భారీ వర్షం కురిసింది. వాగులను తలపించిన రోడ్లు రహదారిపై వెళ్లడానికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత తొలిసారి మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి వద్ద రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు చేరడంతో అక్కడ పరిస్థితి మడుగును తలపించేలా ఉంది. తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఎనుములపల్లి తో పాటు పుట్టపర్తి లోని ప్రధాన రోడ్లన్నీ వాగులను తలపించాయి. – కొత్తచెరువు మండలం తలమర్ల గ్రామంలో భారీ వర్షానికి వీధులన్నీ వాగులను తలపిస్తున్నాయి. అధికారుల స్పందించి రహదారులపై నీరు నిలువ ఉండకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.