సిరా న్యూస్,హైదరాబాద్:
దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను కుల్సుంపుర పోలీసులు మరియు సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల కమాతిపుర రౌడీషీటర్ ఆకాష్ తన సహచరులైన నలుగురు వ్యక్తులతో కలిసి జియాగూడ ఈనెల 4వ తేదీ నాడు 100 ఫీట్ రోడ్డు వద్ద కాపు కాసి డెలివరీ చేయడానికి వెళుతున్న స్విగ్గి బాయ్ ని అడ్డుకొని అతనికి కత్తి చూపించి అతని వద్ద నుండి సెల్ఫోన్ మరియు డబ్బులను కాజేశారు. డెలివరీ బాయ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతనిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును చాలెంజ్ గా తీసుకొని 5 మంది నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 12 సెల్ ఫోన్లతో పాటు ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం కోర్టు ముందు హాజరు పరిచారు.