సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. గ్రామంలోని శివాలయం, పక్కనగల రెండు షాపులలో మరియు ఒక ఇంట్లో దొంగతనం, ఒక బైక్ ను చోరీ చేసారు. ఆలయం లో గల హుండీలో నగదు, బంగారం, ఒక షాపులో లక్ష రూపాయల నగదు, మరొక షాపులో టీవీని దొంగలు ఎత్తుకెళ్లారు. పటాన్ చెరువు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
========