దోమల పేరుతో దోపిడీ

సిరా న్యూస్,హైదరాబాద్;
దోమల నివారణే దోపిడీ మార్గంగా ఎంచుకున్న ఓ ఆఫీసర్ స్టోరీ ఇది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను జలగలా పీడిస్తూ అక్రమార్జనే ధ్యేయంగా పని చేస్తున్న ఓ అవినీతి దోమ ”మచ్చర్ కహానీ” ఇది. చేయని ఫాగింగ్ కు ఫ్యూయల్ (పెట్రోల్, డీజిల్) బిల్లింగ్స్ తో ప్రభుత్వ ఖజానాకు సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్య గండి కొడుతున్నారు. ఫాగింగ్ యూనిట్ల నుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ హూంకరిస్తున్న సీనియర్ ఎంటామలజిస్ట్ సంధ్య ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు.మీరు ఏం చేస్తారో తెలీదు, నాకు మాత్రం డబ్బు ఇవ్వాల్సిందేనని ఆర్డర్ వేస్తున్నారు. ఆఫ్ట్రాల్ మీరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. నా మాట వినకుంటే మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తానని బెదిరించారు. దీంతో గత్యంతరం లేక ఆమె అడిగిన మొత్తాన్ని సమర్పించుకుంటున్నారు. గతంలో సంధ్యపై ఇలాంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. వరంగల్ కార్పొరేషన్ లోనూ డీజిల్ అక్రమాలు, బెదిరింపుల కారణంగానే గతంలో సంధ్య సస్పెండ్ అయ్యారు. అయినా ఆమె తీరులో మార్పు లేదు. తాజాగా జీహెచ్ఎంసీలో ఆమె బలవంతపు వసూళ్లు తెరపైకి వచ్చాయి. సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్య ఉద్యోగి నుంచి డబ్బులు తీసుకుంటున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.
* దోమల నివారణే దోపిడీ మార్గం
* జీహెచ్ఎంసీలో సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్య లీలలు
* చేయని ఫాగింగ్ కు పెట్రోల్, డీజిల్ బిల్లులు
* ఫాగింగ్ యూనిట్ల నుంచి బలవంతపు వసూళ్లు
* ఒక్కో సర్కిల్ నుంచి రూ.30వేలు వసూలు
* ఆమె పరిధిలో మొత్తం 9 సర్కిళ్లు
* ఎన్నికల సమయంలో 10 రోజుల్లో జీహెచ్ఎంసీ ఖజానాకు దాదాపు రూ.2లక్షలు నష్టం
* ప్రతి నెల టార్గెట్ ఫిక్స్ చేసి ఏఈల నుంచి డబ్బులు వసూలు
* డీజిల్, పెట్రోల్ వాడకంలో కోత
* ఆ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంటున్న ఆఫీసర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *