ఎస్సారెస్పీ ఈ.ఎస్.ఈ ని కోరిన ఎమ్మెల్యే డా.సంజయ్
సిరా న్యూస్,జగిత్యాల;
ఎన్నో గ్రామాలకు సాగు, తాగు నీటిని అందించే రోళ్ల వాగు ప్రాజెక్టు ను సత్వరమే పూర్తిచేసి రైతుల ప్రయోజనాలను కాపాడాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కోరారు. గురువారం హైద్రాబాద్ లోని జలసౌధలో నీటిపారుదల శాఖ ఈ.ఎస్.ఈ అనిల్ తోపాటు మెయింటనెన్స్ నాగేందర్ ను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా సారంగాపూర్ లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని వివిధ కారణాలతో ప్రాజెక్టు పూర్తిస్తాయిలో ప్రజలకు అందుబాటులోకి రాలేక పోయిందన్నారు. రోల్లవాగు ప్రాజెక్టు ను త్వరితగతిన పూర్తిచేయాలని ఎమ్మెల్యే సంజయ్ కోరారు. అలాగే జగిత్యాల అర్బన్ మండలంలోని మోతె చెరువు మత్తడిని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, గుల్లపేట చెక్ డ్యామ్ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు మేలుచేయాలని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అధికారులను కోరారు.