సిరా న్యూస్;
ఎలాగైనా అధికారంలోకి రావాలి.. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.. ఈ లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రూపొందించినట్టు కనిపిస్తోంది. స్వాతంత్ర అనంతరం దేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టిన కాంగ్రెస్ .. పదేళ్ల క్రితం వరకు అధికారంలో కొనసాగింది. అనేక రాష్ట్రాలను పరిపాలించింది. నాడు ఘనం.. నేడు అధ్వానం అనే సామెత తీరుగా ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత 10 సంవత్సరాల నుంచి పోల్చి చూస్తే ఆ పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. ఇలాంటి క్రమంలోనే ఆ పార్టీ ఐటీ లొసుగులు ఇటీవల వెలుగు చూసాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టింది. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలంటే కచ్చితంగా అధికారంలోకి రావాల్సిన అనివార్యత కాంగ్రెస్ పార్టీది. అందువల్లే పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని మేనిఫెస్టో రూపొందించింది.ఎన్నికల సమయంలో ఎలాంటి హామీలు ఇస్తామనే దానిమీద చాలావరకు రాజకీయ పార్టీలు దృష్టి పెడుతుంటాయి. గంపగుత్తగా ఓట్లను దక్కించుకునేందుకు ఆకర్షణీయమైన హామీలను తెరపైకి తెస్తుంటాయి. అలాంటి మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరించింది. ఈ మేనిఫెస్టోలో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ ఒక హామీని ఇచ్చింది.. ఆ హామీని కనుక ప్రజలు నమ్మితే ఇండియా కూటమిలో ఎటువంటి పార్టీల అవసరం లేకుండానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలదు. అంతేకాదు ప్రతి మహిళ ఈ హామీని గనక నమ్మితే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు వేయగలదు. కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరించిన మేనిఫెస్టోలో ఉన్న హామీ ప్రకారం.. దేశంలోని ప్రతి మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు చెల్లిస్తారట. అంటే స్థూలంగా నెలకు 8,500. అంత మొత్తంలో నగదంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక చిన్న స్థాయి ఉద్యోగి సంపాదించే మొత్తం అది. కేవలం ఆడవారిగా పుట్టినందుకు కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో నజరానా ఇస్తుందన్నమాట.ఈ హామీలో చిన్నపాటి తిరకాసు ఉంది.. పేదింటి ఆడవారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తారట. అంటే తెల్ల రేషన్ కార్డుతో ఈ పథకాన్ని అనుసంధానం చేస్తారని సమాచారం. అయినప్పటికీ ఇది చాలా పెద్ద హామీగానే లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. ఈ హామీని గనక అమలు చేస్తే ప్రభుత్వం మీద ప్రతి ఏడాది లక్షల కోట్ల భారం పడుతుంది..మరోవైపు నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని వివిధ సర్వే సంస్థలు చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల పర్వంలో ఇచ్చిపుచ్చుకోవడాలు మొదలైపొయ్యాయి. తామొస్తే ఏమిస్తామో చెప్పుకుంటూ మేనిఫెస్టోల మేజిక్‌ని జోరుగా షురూ చేశాయి జాతీయ పార్టీలు. ఈ విషయంలో మేమే ఫస్ట్ అంటూ హామీల పుస్తకాన్ని జనం ముందుంచింది హస్తం పార్టీ. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిందాన్ని గుర్తు చేస్తూ ఈసారి అంతకుమించి చేస్తాం.. అంటూ గట్టిగానే వాగ్దానం చేస్తోంది. ఆలిండియా కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోను, అందులోని గ్యారంటీల పరంపరను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. దేశవ్యాప్తంగా మారుమోగుతున్న మోదీ చరిష్మాను, ఆయనిస్తున్న గ్యారంటీ సౌండ్‌ను గ్యారంటీలతోనే తిప్పికొట్టాలని డిసైడైంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే.. పాంచ్ న్యాయ్.. పచీస్ గ్యారంటీస్.. అంటూ 48 పేజీల మేనిఫెస్టోకు కలర్‌ఫుల్ టచింగ్ ఇచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ కూడా అదే విశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి పథకాలు ప్రకటించడం సరికాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నారు. కానీ ఈ సమయంలో అధికారమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ.. ఇతర పార్టీలు కనీసం ఆ దిశగా ఆలోచించేందుకు భయపడే పథకాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ పథకం మాత్రమే కాదు, చాలా వరాలు ప్రకటించింది. అయితే వీటన్నింటినీ కాంగ్రెస్ పార్టీ స్వయంగా వెల్లడించింది. అలాంటప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే.. ఈ హామీలను ఏం చేస్తుందనేది అసలు ప్రశ్న. . దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ జరుగుతుందట. విద్యారుణాలు మాఫీ చేయడంతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష ఫీజుల రద్దు చేస్తామంటూ యువతను మెస్మరైజ్ చేస్తోంది కాంగ్రెస్ మేనిఫెస్టో. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు, అగ్నివీర్ స్కీమ్ రద్దు, రైల్వే ప్రైవేటీకరణ నిలిపివేత, జమ్ము కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా లాంటి ప్రామిస్‌లు కూడా ఇక్కడ ఆసక్తికరం. ఎలక్టోరల్ బాండ్స్‌తో పాటు పెగాసెస్ లాంటి కుంభకోణాలపై విచారణ జరిపిస్తామంటోంది హస్తం పార్టీ. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకొస్తేనే, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి ఐతేనే ఇవన్నీ చెయ్యగలమని చెప్పకనే చెబుతోంది కాంగ్రెస్ పార్టీ. కానీ.. ఇండీ కూటమి ఉమ్మడి అభ్యర్థి కాన్సెప్ట్‌ని వర్కవుట్ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టో ఫ్యూచరేంటి.. ? ఐతే కామ్రేడ్లకు, కాంగ్రెస్‌కీ మధ్య పొత్తు ప్రసక్తులే లేని తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి అభ్యర్థి కాన్సెప్ట్ ఏమైనట్టు..? ఇన్ని ప్రశ్నల నడుమ దేశవ్యాప్తంగా ఇంట్రస్టింగ్ టాపిక్‌గా మారింది కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో.ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ ఆ హామీ నుంచి కచ్చితంగా తప్పించుకుంటుంది. అలాంటప్పుడు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్నప్పుడే కూటమి పార్టీలతో కలిసి ఆ కార్యక్రమం చేపడితే బాగుండేది. కానీ కాంగ్రెస్ ఆ పని చేయలేదు. అలాంటప్పుడు సొంతంగా ఎందుకు మేనిఫెస్టో విడుదల చేసిందనే ప్రశ్నకు.. కాంగ్రెస్ పార్టీ వద్ద సమాధానం లేదు