దర్బార్ హోటల్ లో కుళ్లిన ఆహార పదార్ధాలు

సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ లోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ లో కుళ్లిన ఆహారపదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో సదరు రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు .
నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమీషన్ హైదరాబాద్ ఛైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు దర్బార్ రెస్టారెంట్ లో ఫుడ్ ఇనస్పెక్టర్ ధర్మేందర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేసి కుళ్లిన , గడువు మీరిన ఆహారపదార్థాలు సీజ్ చేసి పరీక్షలకు పంపారు. కాగా కుళ్లిన , తేదీ మీరిన ఆహారపదార్థాలు అమ్మి వినియోగదారుల అనారోగ్యానికి కారణం అవుతున్న రెస్టారెంట్లు , హోటళ్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ అధికారులను డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *